దేశంలో ఒక్కరోజే 3,656 మందికి కరోనా

దేశంలో ఒక్కరోజే  3,656 మందికి కరోనా

46,437కి చేరిన
మొత్తం కరోనా కేసులు
గత 24 గంటల్లో
103 మంది మృతి
కోలుకున్న 1,079 మంది

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 3,656 మందికి పాజిటివ్‌‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,437కి చేరింది. గత 24 గంటల్లో 103 మంది చనిపోగా దేశవ్యాప్తంగా మరణించిన వాళ్ల సంఖ్య 1,566కు చేరింది. ఇప్పటివరకు 12,842 మంది రికవరవగా గత 24 గంటల్లో 1,079 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల్లో మహారాష్ట్ర టాప్‌‌లో ఉంది. ఇక్కడ ఇప్పటికే 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ త ర్వాత స్థానంలో గుజరాత్‌‌ (5,804), ఢిల్లీ (4,898) ఉన్నాయి.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అతి పెద్ద విజిటబుల్​మార్కెట్​వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 527 కేసులు నమోదుకాగా, ఒకరు చనిపోయారు. సోమవారం నమోదైన కేసులన్నీ కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవేనని సర్కార్​ వెల్లడించింది. మార్కెట్‌కు సంబంధం ఉన్న వారి నుంచి 100కు పైగా శాంపిల్స్ కలెక్ట్​చేసినట్లు కుడ్డలూర్‌‌లో ఉన్న అధికారులు చెప్పారు.
లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్​రాష్ట్రంలోని గౌతంబుద్ధ్​నగర్‌‌లో ఒక సీఐఎస్‌ఎఫ్​ఆఫీసర్​సహా 12 మందికి కరోనా పాజిటివ్​వచ్చింది. గడిచిన 24 గంటల్లో 81 రిపోర్టులు రాగా, 12 మందికి పాజిటివ్​మిగిలిన వారికి నెగెటివ్​అని తేలింది.
కోల్​కతా : బెంగాల్‌లో కరోనాతో సొమవారం ఒక్కరోజే 11 మంది చనిపోగా, 61 మందికి వైరస్​సోకింది. ట్రీట్​మెంట్​ తర్వాత కోలుకుని 218 మంది హాస్పిటల్​నుంచి డిశ్చార్జ్​అయ్యారని చీఫ్​సెక్రెటరీ రాజీవ్​సిన్హా చెప్పారు.
కేరళ: కేరళలో వరుసగా రెండో రోజు కూడా ఒక్క పాజిటివ్​కేసు నమోదు కాలేదు. సోమావారం ఒక్క రోజే 61 మంది హాస్పిటల్​నుంచి డిశ్చార్జ్​ కాగా, మరో 34 మంది ట్రీట్మెంట్​ తీసుకుంటున్నారని చీఫ్​మినిస్టర్​పినరయి విజయన్​చెప్పారు.
ముంబై: ముంబైలోని స్లమ్ ఏరియా ధారావిలో కొత్తగా 42 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 632కి పెరిగింది. రెండ్రోజులుగా ఒక్క డెత్​కేసు నమోదు కాలేదు. వైరస్​ బారిన పడి ఇంతవరకు20 మంది చనిపోయారు.
పుణె: కరోనా సోకి అసిస్టెంట్​సబ్​ఇన్‌స్పెక్టర్​చనిపోయారు. ఒబెసిటీ, హైపర్‌‌టెన్షన్​సమస్యలతో హాస్పిటల్‌లో జాయిన్​అయిన 57 ఏండ్ల అసిస్టెంట్​సబ్​ఇన్‌స్పెక్టర్‌..‌ 12 రోజులుగా వెంటిలేటర్‌‌పై ట్రీట్​మెంట్​ తీసుకుంటూ మరణించారు. ఏప్రిల్​చివరి వారంలో ఆయనకు వైరస్​పాజిటివ్​వచ్చిందని పుణె జాయింట్​కమిషనర్ ఆఫ్​పోలీస్​రవీంద్ర షిసావె చెప్పారు. ఇప్పటివరకు పుణెలో పనిచేసే పోలీసు సిబ్బంది 12 మందికి కరోనా సోకిందని చెప్పారు.