కరోనాతో దేశంలో ఒక్కరోజే  3,293 మంది బలి

కరోనాతో దేశంలో ఒక్కరోజే  3,293 మంది బలి

ఇప్పటిదాకా 2 లక్షలు దాటిపోయిన కరోనా డెత్స్
ఒక్క మహారాష్ట్రలోనే 895 మరణాలు
3,60,960 కొత్త కేసులు నమోదు 16.55కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య


న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి కల్లోలం ఆగడం లేదు. వేల మందిని బలి తీసుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలోనే 3,293 మంది పొట్టనబెట్టుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదైంది. 3,60,960 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరిందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 29,78,709కు చేరినట్లు తెలిపింది. రికవరీ రేటు 82.33కు పడి పోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 16.55కు పెరిగింది. ఇప్పటిదాకా 28,27,03,789 టెస్టులు చేశామని, మంగళవారం ఒక్కరోజే 17,23,912 శాంపిల్స్ పరీక్షించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.
4 రాష్ట్రాల్లో 200కు పైనే
24 గంటల్లో 3,293 మంది చనిపోయినట్లు బుధవా రం వెల్లడించిన హెల్త్ మినిస్ట్రీ.. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 895 మంది కరోనాకు బలైనట్లు చెప్పింది. ఢిల్లీలో 381, ఉత్తర ప్రదేశ్​లో 264 మంది, చత్తీస్ గఢ్​లో 246 మంది, కర్నాటకలో 180 మంది, గుజరా త్​లో 170 మంది, జార్ఖండ్​లో 131 మంది, రాజస్తాన్​లో 121 మంది, పంజాబ్ లో 100 మంది చనిపోయారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,01,187కి చేరింది. ఇందులో మహారాష్ట్రలో 66,179 మంది, ఢిల్లీలో 15,009 మంది, కర్నాట కలో 14,807 మంది, తమిళనాడులో 13,728 మంది, బెంగాల్​లో 11,082 మంది మరణించారు.

17 దేశాల్లో ఇండియన్ మ్యుటెంట్​​

ఇతర వేరియంట్లకన్నా ఫాస్ట్ గా వ్యాపిస్తోంది: డబ్ల్యూహెచ్‌‌వో
జెనీవా: ఇండియాలో ప్రారంభమైన డబుల్ మ్యుటెంట్ కరోనా(బీ.1.617) రకం మరో 17 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) మంగళవారం వెల్లడించింది. మన దేశంలో కేసులు తీవ్రంగా పెరిగేందుకు కారణమవుతున్న డబుల్ మ్యుటెంట్ వైరస్​ను ‘వేరియంట్స్ ఆఫ్ ​ఇంట్రెస్ట్(వీవోఐ)’ డిసిగ్నేషన్​తో గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఇండియన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ కు సంబంధించి 1200 జీనోమ్ సీక్వెన్లను గుర్తించినట్లు తెలిపింది. ఇండియాలో కొత్త రకం కరోనా వల్ల ఫస్ట్ వేవ్​లో కన్నా ఇప్పుడు సెకండ్ వేవ్​లో వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. కాగా, బీ.1.617 రకం కరోనా వేరియంట్​ను మన దేశంలో మొదట గత ఏడాది డిసెంబర్​లో గుర్తించారు. అప్పటి నుంచి ఇతర వేరియంట్ల కన్నా ఇది ఫాస్ట్ గా వ్యాపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 50 శాతానికి పైగా కొత్త కేసులు డబుల్ మ్యుటెంట్ కరోనాకు సంబంధించినవేనిని అధికారులు గుర్తించారు. అయితే ఈ వైరస్​కు వ్యతిరేకంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు.