కరీంనగర్ జిల్లాలో కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి

 కరీంనగర్ జిల్లాలో కారు, బస్సు ఢీకొని ఒకరి మృతి

తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం ఇందిరానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారిపై కారు, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొంగారి మృత్యుంజయ్(32), భార్య, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం కారులో కరీంనగర్​వచ్చాడు. రాత్రి తిరిగి వెళ్తుండగా కారు ఇందిరానగర్ చేరుకోగానే మరో వాహనాన్ని ఓవర్​టేక్​ చేయబోయి డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. 

దీంతో అదుపుతప్పి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న మృత్యుంజయ్​ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.