చలిమంట కాచుకుంటున్నాడంటూ యువకుడ్ని హత్య చేసిన తండ్రీ కొడుకులు

చలిమంట కాచుకుంటున్నాడంటూ యువకుడ్ని హత్య చేసిన తండ్రీ కొడుకులు

చలిమంట కాచుకుంటున్నాడంటూ యువకుపై తండ్రీ కొడుకులు దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో తీవ్రగాయాలైన   బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గురుగ్రామ్ లోని నాథుపూర్ ఏరియాలో దారుణం జరిగింది. బాధితుడు జార్ జిష్ అలీ చలికాచుకునేందుకు  వినయ్ అనే మరో యువకుడి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలో వినయ్ లేడు.  వినయ్ వచ్చిన వెంటనే అలీపై నా స్థానాన్ని ఎందుకు ఆక్రమించుకున్నావంటూ ప్రశ్నించాడు. ఆపై దూర్భుషలాడాడు. వినయ్ తన తండ్రిని రమేష్ ను పిలిపించి బాధితుడ్ని చిత్రహింసలకు గురిచేశారు. పిడిగుద్దులు గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిందితుల దెబ్బలకు తాళలేక ఆపాస్మరక స్థితిలోకి జారుకున్నాడు.

అయితే సమాచారం అందుకున్న అలీ భార్య అత్యవసర చికిత్స కోసం బాధితుణ్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. అలీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, సఫ్ దార్ జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలలని వైద్యులు సూచించారు.  అత్యవసర చికిత్స కోసం అలీని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.