
అస్సాంలోకి అక్రమంగా వలస వచ్చిన విదేశీయుల లెక్కలు తేల్చేందుకు తయారుచేస్తున్న నేషనల్రిజిస్టర్ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) డ్రాఫ్ట్‌లోంచి దాదాపు లక్ష మంది పేర్లను అధికారులు తొలగించారు. లోకల్వెరిఫికేషన్లో అనర్హులుగా తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఆర్సీ కో ఆర్డినేటర్చెప్పారు. దీంతో గతేడాది జులై 30న పబ్లిష్చేసిన లిస్ట్‌లో మరో 40 లక్షల పేర్లు చేరాయి. తొలగించిన పేర్లను వెబ్సైట్లో పెట్టడంతో పాటు పర్సనల్లెటర్ల ద్వారా వారికి తెలియజేస్తామన్నారు. ఎన్ఆర్సీ నుంచి పేరు తొలగించడంపై అభ్యంతరాలు ఉన్నవారు ఎన్ఆర్సీ ఎన్ఎస్కే సెంటర్లలో క్లెయిం చేసుకోవచ్చని, వచ్చే నెల 5 నుంచి వాటిపై విచారణ జరుగుతుందని వివరించారు. అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ప్రభుత్వం 1951 తర్వాత తొలిసారిగా ఎన్ఆర్సీ లిస్ట్‌ను అప్డేట్చేస్తోంది. ఎన్ఆర్సీ లిస్ట్‌లో పేరు నమోదుకు 3.29 కోట్ల దరఖాస్తులు రాగా.. అందులో 2.9 కోట్ల మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రూపొందిస్తున్న ఈ కొత్త లిస్ట్‌ను ప్రభుత్వం జూలై 31న విడుదల చేయనుంది.
అనర్హులపేర్ల తొలగింపు…
ఎన్ఆర్సీ అస్సాం అడిషనల్ డ్రాఫ్ట్2019 నుంచి లక్షకు పైగా పేర్ల తొలగింపునకు కారణం స్థానికంగా జరిగిన విచారణలో అనర్హులుగా తేలడమేనని అధికారులు చెబుతున్నారు. ఎన్ఆర్సీలో పేరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను లోకల్రిజిస్ట్రార్స్ఆఫ్సిటిజెన్స్రిజిస్టర్(ఎల్‌ఆర్‌సీఆర్)లతో ప్రభుత్వం విచారణ జరిపించింది. ఇందులో డిక్లేర్డ్ఫారెనర్(డీఎఫ్), డౌట్ఫుల్ఓటర్(డీవీ), పర్సన్స్విత్కేసెస్పెండింగ్ఎట్ఫారెనర్స్ట్రిబ్యునల్స్, వారి వారసుల దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు చెప్పారు.