విద్యార్థులకు వేడివేడి ఆహారం ఇవ్వాలి : కలెక్టర్ విజయేందిర బోయి

విద్యార్థులకు వేడివేడి ఆహారం ఇవ్వాలి : కలెక్టర్ విజయేందిర బోయి

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : విద్యార్థులకు సరిపోయేంత ఆహారం వండి వేడివేడిగా అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి టీచర్లను ఆదేశించారు. సోమవారం నగరంలోని మెట్టుగట్ట వద్ద ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, కూరగాయలు చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపోయేంత ఆహారం మాత్రమే వండాలని చెప్పారు. ఫ్రిడ్జ్ లోపల ఉన్న కూరగాయలను పరిశీలించి ప్రతిరోజు తాజాగా తెచ్చుకోవాలన్నారు. 

మెనూ ప్రకారం తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించి పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. అక్కడున్న ఇద్దరు విద్యార్థులతో ముచ్చటిస్తూ ఎలా చదువుతున్నారు..? ఏం చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్వో వాటర్ ప్లాంట్, స్టోర్ రూమ్, లైబ్రరీని పరిశీలించారు. నగరంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటీఐ, ఐటీసీ సెంటర్లను తనిఖీ చేశారు. ఐటీఐలో ఖాళీగా ఉన్న అన్ని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. సాంకేతిక లోపాలను గుర్తించిన కలెక్టర్ వెంటనే వాటిని సరిచేసి రిపోర్టు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.