బీఆర్ఎస్ సభకు వెళ్లిన వెహికల్ ఢీకొని.. సిద్దిపేట జిల్లాలో ఒకరు మృతి మరొకరికి సీరియస్

బీఆర్ఎస్ సభకు వెళ్లిన  వెహికల్ ఢీకొని.. సిద్దిపేట జిల్లాలో ఒకరు మృతి మరొకరికి సీరియస్

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ సభకు వెళ్లిన వెహికల్ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి సీరియస్ అయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తాడం సారయ్య, బండోజు గణేశ్ రోజూ సిద్దిపేటకు వెళ్లి భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలో వీరు పనులు ముగించుకుని బైక్ పై బస్వాపూర్ వెళుతుండగా.. నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఎదురుగా ఎల్కతుర్తిలో జరిగిన కేసీఆర్ ​సభకు వెళ్లి వస్తున్న తుపాన్ వెహికల్ ఢీకొట్టింది. 

ప్రమాదంలో తాడం సారయ్య (36) స్పాట్ లో చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ గణేశ్ ను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ  ఆస్పత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.  రాజగోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు 
చేస్తున్నారు.