రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘వన్ సన్ వన్ మూన్’ అంటూ సాగిన పాటను అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేయడంతోపాటు ఎం.ఎస్.కృష్ణతో కలిసి పాడటం హైలైట్‌గా నిలిచింది.
తమిళ, ఇంగ్లీష్ కలయికలో సాగిన పాటకు హైసెన్‌బర్గ్, సూపర్ సుబు లిరిక్స్ అందించారు. రజనీకాంత్ ఇమేజ్, ఆయనకున్న స్టార్‌డమ్‌ను ఎలివేట్ చేసేలా మెలోడీ టచ్‌తో పాటను రూపొందించారు. ఇందులో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన కొన్ని కొత్త లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘జైలర్’లో ముత్తువేల్ పాండియన్‌గా అదరగొట్టిన రజనీకాంత్.. సీక్వెల్‌లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు.
తొలి భాగంలోని రమ్యకృష్ణన్, మిర్నా, శివరాజ్‌కుమార్, యోగిబాబు, జాఫర్ సాదిక్, వినాయకన్ తదితరులు ‘జైలర్ 2’లోనూ కనిపించనున్నారు. కొత్తగా ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజారమూడు, విద్యాబాలన్, విజయ్ సేతుపతి, షామ్నా కాసిమ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
