కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో దారుణం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్ లో పడి మృతి చెందింది ఓ చిన్నారి. చింతల్, సాయి నగర్ లో నివాసముండే సుధాకర్, బిందుల ఏడాది వయసున్న కూతురు రియా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల బకెట్ లో పడిపోయింది. బకెట్ లో నీళ్లు నిండా ఉండటంతో ఊపిరాడక చనిపోయింది. ఆ పక్కనే బట్టలు పిండుతున్న తల్లి గమనించి రియాను వెంటనే చింతల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
