ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ లాభం రూ.10,015 కోట్లు

ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ లాభం రూ.10,015 కోట్లు
  • ప్రొడక్షన్ తగ్గడంతో ప్రాఫిట్ 34 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ (ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ) కి  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రూ.10,015 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.15,206 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ తగ్గడంతో పాటు  క్రూడాయిల్ ధరలు తగ్గడంతో కంపెనీ ప్రాఫిట్ పడిందని ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ  ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దేశంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌, గ్యాస్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యారెల్ ఆయిల్‌‌‌‌‌‌‌‌పై 76.49 డాలర్లు రెవెన్యూ సాధించింది. 
కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో బ్యారెల్‌‌‌‌‌‌‌‌పై సగటున 108.55 బిలియన్ డాలర్లు సాధించింది. కాగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడాన్ని చూశాం. ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ రెవెన్యూ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 20 శాతం తగ్గి రూ.33,814 కోట్లుగా రికార్డయ్యింది. మొత్తం 46 లక్షల టన్నుల క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేశామని ప్రకటించింది. గ్యాస్ ఉత్పత్తి 504 కోట్ల క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొంది.
ఈ రెండూ కూడా కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే సుమారు 3 శాతం చొప్పున తగ్గాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ ప్రొడక్షన్ తగ్గడానికి ప్రధాన కారణం పన్నా–ముక్తా ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షోర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ షట్‌‌‌‌‌‌‌‌డౌన్ అవ్వడమే. కొత్త క్రూడాయిల్ పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ వేయడానికి, ఎవాక్యూయేషన్ ఫెసిలిటీని మెరుగుపరచడం కోసం ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను మూసేశారు.  
ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఫీల్డలను కనుగొన్నామని, ఇందులో మూడు ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ ఏరియాలో ఉండగా, ఒకటి ల్యాండ్‌‌‌‌‌‌‌‌పై ఉందని వివరించింది. ముంబై ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మిడ్‌‌‌‌‌‌‌‌, సౌత్‌‌‌‌‌‌‌‌ తపతి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో వీటిని గుర్తించారు. దీనికి పుఖ్రాజ్‌‌‌‌‌‌‌‌ అని పేరు పెట్టారు. కృష్ణా –గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లో ఒకటి గుర్తించారు.