
- కొనసాగుతున్న ఆదాని గ్రూప్ షేర్ల పతనం
అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా రాకెట్ స్పీడ్ తో పెరిగిన అదానీ గ్రూప్ షేర్లు అంతే వేగంగా పడిపోతున్నాయి. మారిషస్ కు చెందిన మూడు విదేశీ పెట్టుబడుల సంస్థల ఖాతాలను ఎన్ఎస్ డిఎల్ జప్తు చేసిందని వస్తున్న ఆరోపణలను ఉటంకిస్తూ పలు వార్తా సంస్థలు అదాని కంపెనీల షేర్లు ఉన్న ఖాతాలను జప్తు చేయలేదని చెబుతున్నా షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇవాళ శుక్రవారం నాలుగు షేర్ల ధరలు ప్రతిరోజు మాదిరిగానే లోయర్ సీలింగ్ వద్ద ముగిశాయి.
అదానీ గ్రూప్ కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు షేర్లు లోయర్ సీలింగ్ వద్ద ముగిశాయి. స్టాక్ ఎక్చేంజీలు లోయర్ సీలింగ్ కన్నా తగ్గడానికి అనుమతించవు. అంటే గత ఐదు రోజులుగా సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం వరకు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 1.91 లక్షల కోట్లు తగ్గిపోయింది. ఈ వారం ఆరంభదినం రోజున సోమవారం నాడు తొలిసారి 7.33 శాతం లాభంతో క్లోజ్ కాగా అదాని ఎంటర్ ప్రైజెస్ 8.76 శాతం లాభవంతో ముగిసిన విషయం తెలిసిందే.