కరీంనగర్ లో కొనసాగుతున్న పోలింగ్

కరీంనగర్ లో కొనసాగుతున్న పోలింగ్

కరీంనగర్  కార్పొరేషన్ ఎన్నికల  పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అటు మాజీ ఎంపీ వినోద్ తో పాటు…మున్సిపల్ కమిషనర్ వేణు గోపాల్ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఓటు వేశారు. అటు కరీంనగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లున్నాయి.

ఇందులో 2 ఏకగ్రీవం కాగా.. మిగతా 58 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ లో 2 లక్షల 72 వేల 195 మంది ఓటర్లున్నారు.  111 ప్రాంతాల్లో  348 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 మంది రిటర్నింగ్ అధికారులు,  మరో 20 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు.. రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు పోలింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని కేటాయించారు.

పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు..  వెబ్ కాస్టింగ్ తో.. పరిస్థితిని సమీక్షించేలా అధికారులు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలుతో పాటు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కరీంనగర్ SRR కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చనున్నారు. 27న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉంటుంది.

see also: సర్పంచ్ గుడ్ జాబ్ : కొలువులకు కేరాఫ్ ప్రేరణ

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్