కొయ్యకుండానే కనీళ్లుపెట్టిస్తున్న ఉల్లి.. వాడకం ఆపేసిన ప్రధాని

కొయ్యకుండానే కనీళ్లుపెట్టిస్తున్న ఉల్లి.. వాడకం ఆపేసిన ప్రధాని

ఉల్లి ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.  దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది. అయితే ఈ నిషేదం ప్రభావం పొరుగుదేశమైన బంగ్లాదేశ్ పై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఉల్లిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేదం విధించడంతో ఆదేశం.మయన్మార్, టర్కీ, చైనాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఉల్లి దిగుమతి చేసుకోవడంతో  ఆ దేశంలో ఉల్లి ధర రూ.220 నుంచి రూ.260కి చేరింది. ఉల్లి ధర పెరగడంతో బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా వాడటం నిలిపివేశారు. ఉల్లి వాడకాన్ని నిలిపివేసినట్లు ఆమె మీడియా సెక్రటరీ తుషార్ వెల్లడించారు.