ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో బ్యూటీ ప్రొడక్ట్‌లు అమ్ముతున్న టీరా హైదరాబాద్‌లో తన మొదటి స్టోర్‌ను ఓపెన్ చేసింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఈ కంపెనీ స్టోర్‌లో గ్లోబల్, ఇండియన్ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. టీరాను ఈ ఏడాదే రిలయన్స్ రిటైల్ ఏర్పాటు చేసింది. టీరా యాప్‌ను 15 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొంది.