ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్‌ క్లాసులు

ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్‌ క్లాసులు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జనవరి 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా 8,9,10 తరగతులకు కచ్చితంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు తమ విధులకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ 50 శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది విధులకు హాజరు కావాలని  సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

For More News..

రాష్ట్రంలో వేలల్లో నమోదవుతున్న కరోనా కేసులు

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

ఇండిపెండెంట్‎ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ సీఎం

మేం అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్