ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • రూ.20 లక్షల 50 వేల నగదు స్వాధీనం
  • బెట్టింగ్ కు ఉపయోగిస్తున్న పరికరాలు సీజ్
  • ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు..
  • సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్ 
  • నిజాంపేటలోని ఓ అపార్టుమెంట్లో పట్టుపడిన ముఠా

హైదరాబాద్: ఆన్ లైన్ లో  క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా పట్టుపడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ముఠా సభ్యులందరూ ఏపీ వ్యక్తులేనని తేలింది. సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు మంగళవారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా.. నిజాంపేటలోని ఓ అపార్టుమెంట్లో ముఠా పట్టుపడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచులపై  ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఐదుగురు ముఠా సభ్యులు పట్టుపడగా వీరి వద్ద 20  లక్షల యాభైవేల నగదు, 1 బెట్టింగ్ బోర్డ్, 1 లాప్ టాప్, 33 మొబైల్ ఫోన్స్, 1 ఎమ్ ఈ టీవీ, 1 హాత్ వే రుటర్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు సోమన్న పరారీలో ఉండగా, మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా మీడియాతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ ఎస్వోటీ మాదాపూర్  పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని వెల్లడించారు. కేవలం భారత జట్టు మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏ క్రికెట మ్యాచులు జరిగినా బెట్టింగులకు పాల్పడడం వీరి అలవాటని తేలిందన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈనెల 8వ తేదీ నుండి స్టార్ట్ అయ్యింది, ఈ మ్యాచులపై నిజాంపేటలోని ఓ అపార్ట్మెంట్  లో ఉంటూ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా  ముఠాను పట్టుకోవడం జరిగిందని వివరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోమన్న ప్రదాన నిందితుడని గుర్తించామని... ఇతను దాడి సమయంలో లేకపోవడంతో తప్పించుకున్నాడని తెలిపారు.

హైదరాబాద్ కేంద్రంగా కొన్ని యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయని,లైవ్ లైన్ గురు,క్రికెట్ మజా,లోటస్,బెట్365,బెట్ ఫెయిర్ ఇలాంటి యాప్స్ ద్వారా బెటింగ్స్ కు పాల్పడుతున్నారని, ఈ బెట్టింగ్స్ వల్ల ఎక్కువ యూత్, స్టూడెంట్స్  నష్టపోతున్నారని, ఈ మధ్య కాలంలో ఇది పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల చేసి మరీ బెటింగ్ ఆడుతున్నారని, పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టకపోతే బెట్టింగు లాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారని హెచ్చరించారు. బెట్టింగ్ వలన మానసికంగా దెబ్బ తినడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని, అందుకే ఎవరు ఇలాంటి బెట్టింగ్ లు అడవద్దు అని ఆయన సూచించారు. గతంలో ఐపీఎల్ సీజన్ నడిచినప్పుడే బెట్టింగ్ నిర్వహించేవారు.. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ కూడా బెట్టింగ్ పాల్పడుతున్నారు కొన్ని ముఠాలు.. ఎవరైనా ఇలాంటి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి..ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సీపీ సజ్జనార్ తెలిపారు.