పొరపాటున డబ్బులు మరొకరికి పంపించారా.. ఇలా చేస్తే వెంటనే వచ్చేస్తాయ్

పొరపాటున డబ్బులు మరొకరికి పంపించారా.. ఇలా చేస్తే వెంటనే వచ్చేస్తాయ్

డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో ఆన్ లైన్ లావాదేవాలు సెకన్లలో జరుగుతాయి. ఒక్కో సారి మనం డబ్బు పంపించే ఖాతా నంబరును తప్పుగా ఎంటర్ చేస్తుంటాం. అలాంటప్పుడు వేరే వాళ్ల ఖాతాల్లోకి డబ్బు జమ కావడంతో కంగారు పడిపోతాం.తప్పుడు ఖాతా నంబరు డబ్బు బదిలీ అయితే మనం ఏం చేయాలి..మన డబ్బును తిరిగి ఎలా పొందాలి.. ఆర్బీఐ రూల్స్ ఏమిటి. ఇలాంటి ఉపయో కరమైన సమాచారం మీకోసం. 

ముందుకు మనం డబ్బును ట్రాన్స్ ఫర్ చేసిన వారి ఖాతా నెంబరు, బదిలీ చేసిన మొత్తం వివరాలు నిర్ధారించుకోవాలి. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్ ను సంప్రదించి వివరాలు తెలియజేయాలి. ఒకవేళ మీరు నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతా మనుగడలో లేకుండా అంటే.. యాక్టివ్ గా లేకుండా మీ డబ్బు వెంటనే తిరిగి దానంతట అదే మీ ఖాతాలో జమ అవుతుంది. ఏదైనా ఆలస్యం జరిగితే మీ బ్యాంకు ఆ ప్రక్రియ వేగంగా జరిగేటట్లు  సహాయం చేస్తుంది. 

ఒకవేళ మీరు తప్పుగా నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉంటే, లబ్ధిదారుని పేరు వేరుగా ఉంటే మీరు వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయాలి. మీరు పొరపాటుగా ఈ ఖాతాకు డబ్బు బదిలీ చేసినట్లు రుజువులు చూపించాలి. బ్యాంకు అధికారులు లబ్ధిదారుని సంప్రదించి మీ డబ్బును తిరిగి పంపించమని రిక్వెస్ట్ చేస్తారు. 

ఒకవేళ మీరు డబ్బు పంపాలనుకున్న వ్యక్తి పేరు.. మీరు తప్పుగా మనీ ట్రాన్స్ ఫర్ చేసిన ఖాతా కలిగివున్న వ్యక్తి పేరు ఒకటే అయితే కొంచెం ఇబ్బంది గా మారుతుంది. ఇలా జరిగితే బ్యాంకు అధికారులు మీకు సహాయం చేసే ముందుకు మీరు పొరపాటుగా వారి ఖాతాకు మీరు డబ్బును బదిలీ చేసినట్టు రుజువులతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

చాలా బ్యాంకులు ఇటువంటి విషయాల్లో స్వీకర్త అనుమతి విధానాన్ని అనుసరిస్తాయి. మీ బ్యాంకు అధికారులు తప్పు గ్రహీత బ్యాంకు అధికారులను సంప్రదించి డబ్బును తిరిగి పంపేందుకు ఖాతాదారుని అనుమతిని కోరుతారు. వారు అంగీకరిస్తేనే డబ్బు వాపస్ వస్తుంది. 

ఈ విషయంలో ఆర్బీఐ ఏమంటోంది..

మనీ ట్రాన్స్ ఫర్ గైడ్ లైన్స్ లో ఆర్బీఐ కీలక విషయాలు నొక్కి చెపుతుంది. మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి ఖాతా, పేరు తదితర వివరాలు స్పష్టంగా తెలియజేయాలని.. పంపే ముందుకు చెక్ఖ చేసుకోవాలని సూచిస్తోంది.