జానారెడ్డి మాత్రమే ఎదిగారు.. ప్రజలు ఎదగలే

V6 Velugu Posted on Apr 02, 2021

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పుట్టగతులు లేవని.. 7 సార్లు గెలిచిన మాజీ మంత్రి జానా రెడ్డి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జానారెడ్డి మాత్రమే ఎదిగారు తప్ప నియోజకవర్గం ఎదగలేదని ఆయన విమర్శించారు. హాలియాలో పలువురు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఆయన స్వాగతం పలికారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో  భగత్ పేరు ప్రకటించగానే పోటీ నుంచి తప్పుకొని ఉంటే జానా రెడ్డి పై గౌరవం మరింత పెరిగేదని, ఈ ఉప ఎన్నికలో భగత్ కొట్టే దెబ్బకు జానారెడ్డి నాగార్జునసాగర్ ను శాశ్వతంగా మరిచిపోతారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చింది గొర్రులు ఇచ్చేందుకేనా అని ఎగతాళి చేశారు, ఇప్పుడు కులవృత్తులు చేసేవారి దెబ్బకు అలాంటి వారంతా బలికాబోతున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ‘‘నోముల భగత్ వెంట కేసీఆర్, ప్రభుత్వం ఉంది.... నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం..నోముల భగత్ ను 50 వేల ఓట్లతో గెలిపించాలి.. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఎన్నో చేశారు..  ఇంకా ఎన్నో చేస్తాం.. రైతుల గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్ ఒక్కడే.. మాకు కులాలు, మతాలు లేవు.. ప్రజల అభివృద్దే లక్ష్యం..’’ తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. 

Tagged Nagarjuna Sagar by-election, Minister, Jana Reddy, nagarjuna sagar, talasani srinivas yadav

Latest Videos

Subscribe Now

More News