
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan), క్రియేటీవ్ డైరెక్టర్ వీఐ ఆనంద్(VI Anand) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలై మంచి విజయాన్నీ సాధించింది. చాలా రోజుల తరువాత సందీప్ కిషన్ కు హిట్ అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.27 కొట్లు కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ గా నిలిచింది.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలయింది. శివరాత్రి కానుకగా మార్చ్ 8న ఓటీటీకి వచ్చిన ఈ సినిమాకు అక్కడ భారీ స్పందన వస్తోంది. కేవలం 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించి ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో నేషనల్ వైడ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ హారర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ మూవీ. వరుస సెలవులు కూడా ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. అలా థియేటర్స్ లో ఓమోస్తారు విజయం సాధించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మరి మీరు కూడా ఫ్రీగా ఉంటె చూసేయండి.