ఆల్ట్ మన్ ఈజ్ బ్యాక్ : బతిమిలాడి తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

ఆల్ట్ మన్ ఈజ్ బ్యాక్ : బతిమిలాడి తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

ఆల్ట్ మన్.. ఆల్ట్ మన్.. ఇప్పుడు ఈ పేరు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్తగా.. ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్న ఆల్ట్ మన్ ను తొలగించటంపై టెక్ ప్రపంచం దుమ్మెత్తిపోసింది. అంతేనా.. ఆల్ట్ మన్ సీఈవో, ఇతర బాధ్యతల నుంచి తప్పించటంపై కంపెనీలోని మిగతా ఉద్యోగులు, ఇతర కీలక నిపుణులు బయటకు వెళ్లిపోవటానికి సిద్ధం అయ్యారు. 

పనిలో పనిగా గూగుల్ సైతం అత్యంత భారీ ప్యాకేజీలు ప్రకటించటంతోపాటు.. ఆల్ట్ మన్ ను మైక్రోసాఫ్ట్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఓపెన్ ఏఐ.. చేసిన తప్పును గుర్తించింది.. ఆల్ట్ మన్ అవసరం ఎంత ఉందో గుర్తించింది.. దీంతో అతనితో రాయబారం చేసింది.. భారీ ఆఫర్స్ ప్రకటించింది.. అగ్రిమెంట్ చేసుకుంది.. 

తాను సృష్టించిన కంపెనీ ఓపెన్ ఏఐకి తిరిగి మళ్లీ వచ్చారు ఆల్ట్ మన్. భారీ ప్యాకేజీతోపాటు అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఎంత ప్యాకేజీ, అగ్రిమెంట్ ఏంటీ అనేది మాత్రం వెల్లడించలేదు ఓపెన్ ఏఐ. డీల్ ఎంత అన్నది ముఖ్యం కాదు.. ఆల్ట్ మన్ మళ్లీ వచ్చారనేది చాలా ముఖ్యం.. ఇది మంచి పరిణామం అంటూ కంపెనీ ప్రకటించటం విశేషం. ఆల్ట్‌మాన్ ఉద్వాసనకు నిరసనగా ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా తిరిగి వస్తున్నాడు. 

 సామ్ ఆల్ట్‌మాన్ కొత్త బోర్డు సభ్యులతో సీఈవోగా కంపెనీకి తిరిగి వస్తారని ఓపెన్ ఏఐ తెలిపింది.  ఇందులో బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో సభ్యులుగా ఉంటారని వెల్లడైంది. దీనికి సంబంధించి సూత్ర ప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓపెన్ ఏఐ అధికారికంగా ప్రకటించింది.  ఈ పరిణామాలపై మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల స్పందించారు.  ఓపెన్ ఏఐ బోర్డులో చేసిన మార్పులను ప్రశంసించారు. ఇది మరింత స్థిరమైన, సుపరిచితమైన, సమర్థవంతమైన పాలనకు మార్గంలో మొదటి ముఖ్యమైన దశగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.