AI టాలెంట్ వార్‌..OpenAI బిగ్ స్టెప్..వెయ్యిమంది ఉద్యోగులకు భారీ బోనస్‌

AI టాలెంట్ వార్‌..OpenAI బిగ్ స్టెప్..వెయ్యిమంది ఉద్యోగులకు భారీ బోనస్‌

ChatGPT మాతృ సంస్థ OpenAI తన ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తన కంపెనీ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుని, టాప్ టాలెంట్‌ను కాపాడుకునేందుకు కంపెనీ దాదాపు మూడింట ఒక వంతు ఉద్యోగులకు మిలియన్ల డాలర్ల బోనస్  ఇవ్వనుంది. వివరాల్లోకి వెళ్తే..

OpenAI మొత్తం సుమారు 3వేలమంది ఉద్యోగులలో వెయ్యి మందికి ఈ బోనస్ అందజేయనుంది. సిలికాన్ వ్యాలీలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు, అలాగే వేగంగా ఎదుగుతున్న AI స్టార్టప్‌లు తమవైపు ప్రతిభావంతులైన ఇంజినీర్లు, పరిశోధకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

OpenAI సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఈ చర్య వెనుక ఉద్దేశం స్పష్టంగా చెప్పారు. మా విజయం మా టాలెంట్‌పై ఆధారపడి ఉంది. వారిని ప్రోత్సహించడం.. మా టీమ్‌లో కొనసాగించుకోవడం మా ప్రాధాన్యం” అని చెప్పారు. 

ఈ బోనస్‌ను స్టాక్ ఆప్షన్లు, నగదు లేదా రెండింటి కలయిక రూపంలో అందించేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు. దీంతో  ఉద్యోగులు దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని స్టాక్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు లేదా తక్షణ లాభాల కోసం నగదు తీసుకోవచ్చు.

ఎందుకు ఈ బోనస్?

  • AI రంగంలో టాలెంట్ వార్‌ మరింత వేడెక్కుతోంది.
  • కొత్త AI మోడల్స్ అభివృద్ధి, పరిశోధనలో వేగం పెరిగింది.
  • ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోవడం సంస్థ భవిష్యత్తుకు నష్టం.

నిపుణుల అంచనా ప్రకారం..ఈ బోనస్ ప్రకటన OpenAI టాలెంట్ రిటెన్షన్ స్ట్రాటజీలో భాగంగా మాత్రమే కాకుండా, AI పరిశ్రమలో పెద్ద ఎత్తున పోటీ ఉందనడానికి సంకేతం అని తెలుస్తోంది.