అలిపిరి మార్గంలో ఎలుగుబంటి సంచారం....కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..

 అలిపిరి మార్గంలో ఎలుగుబంటి సంచారం....కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..

ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు తిరుమల తిరుపతి అధికారులు.. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ఫోకస్ చేపట్టారు.

 తిరుమల అలిపిరి నడక మార్గంలో  ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. టీటీడీ,అటవీ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తిరుమల నడక మార్గంలో చిరుతలు హల్ చల్ చేస్తుండగా తాజాగా ఎన్.ఎస్ ఆలయంకు సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తుంది.  ఎలుగుబంటి ఆనవాళ్లను గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులు సమాచారం అందించారు.  దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్, టీటీడీ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.  ఇదిలా ఉండగా భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తు్న్నారు. 

 అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం గుర్తించేందుకు 320 ట్రాప్ కెమెరాలకీ అదనంగా మరో 200 కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో 82 కెమెరాలని అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ, ఓవైపు అటవీ శాఖా అధికారులు అనేక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూ వస్తోంది. ఆపరేషన్ చిరుతలో భాగంగా ఇప్పటికే బాలిక ఘటన తరువాత రెండు చిరుతలు బోనులో చిక్కాయి. నడకమార్గంలో సంచరించే చిరుతలు పట్టుకునేందుకు అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసారు.