ఆపరేషన్ టైగర్ ​ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు?

ఆపరేషన్ టైగర్ ​ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు?

దేశంలో 1973 ఏప్రిల్​ 1న ఆపరేషన్​ టైగర్​ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో మొత్తం 53 టైగర్​ రిజర్వ్​లున్నాయి. కర్ణాటక రాష్ట్రం బందీపూర్​లో దేశంలో తొలి టైగర్​ రిజర్వును ఏర్పాటు చేశారు. చివరగా ఛత్తీస్​గఢ్​లోని గురు ఘాసిదాస్​ జాతీయ పార్కును 53వ టైగర్ రిజర్వ్​గా ప్రకటించారు. 

పులుల మనుగడ, వ్యాప్తిని నిర్ధారించే లక్ష్యంతో తెలంగాణలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమ్రాబాద్​ టైగర్​ ​రిజర్వు నల్లమల కొండ ప్రాంతాల్లో ఉంది. అంతేకాకుండా మహబూబ్​నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 2,611 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కవాల్​ టైగర్​ రిజర్వ్​ మొత్తం 2015 చ.కి.మీ. విస్తీర్ణంలో మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్​ రిజర్వ్​, ఛత్తీస్​గఢ్​లోని ఇంద్రావతి టైగర్​ రిజర్వ్​కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. కవాల్​, ఇతర్​ రెండు రిజర్వ్​ల మధ్య పులులు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు. 

జాతీయపార్కులు/ అభయారణ్యాలు

ప్రాణహిత    1980 
కవ్వాల్​    1980 
శివ్వారం    1980 
కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్​ పార్క్​    1998
మహావీర్ హరిణవనస్థలి    1975
మృగవని    1994
ఏటూరు నాగారం అభయారణ్యం    1952
కిన్నెరసాని    1952
పోచారం అభయారణ్యం    1952
అమ్రాబాద్​ పులుల సంరక్షణ కేంద్రం    1983
మంజీరా అభయారణ్యం    1978