OTT Movies: ఒకేరోజు OTTకి వచ్చిన రెండు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies: ఒకేరోజు OTTకి వచ్చిన రెండు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి. కేవలం థియేటర్స్ లో మాత్రం కాకుండా ఇటు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు ఆడియన్స్ కోసం సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే ఈ శుక్రవారం(మార్చ్ 22) కూడా రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందు వచ్చాయి.

వాటిలో ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ వచ్చిన  ఈ సినిమాను కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ మనిషి చిల్లర హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకోలేకపోయింది. 

ఇండియాలో జరిగిన పుల్వామా, బాలకోట్ దాడుల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా కథ బాగానే ఉన్నప్పటికి దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అంత ఆకట్టుకోకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు మేకర్స్. ఎలాంటి అప్డేట్ లేకుండా సడన్ గా ఓటీటీకి రావడంతో ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో ఫ్లాప్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ALSO READ :- 11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా రిలీజ్

ఈవారం ఓటీటీకి వచ్చిన మరో క్రేజీ సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాను పురుషోత్తం రాజ్ తెరకెక్కించగా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకో కిల్ల‌ర్ బ్యాక్‌ డ్రాప్‌లో త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. దీంతో ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక ఈ మధ్యే థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను మార్చ్ 22 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.