టైమ్‌ ఇవ్వకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసన

టైమ్‌ ఇవ్వకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసన

సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్యసభలోనూ ప్రకటన చేశారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్రమాదం జరిగిన తీరును, ఆ తర్వాతి ఘటనలను వివరించారు. ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటుచేసినట్టు చెప్పారు. అయితే.. సంతాపం తెలిపేందుకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమయం ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ ను కోరారు విపక్ష నేత ఖర్గే. అయితే.. దేశం తరుపున రాజ్యసభ నివాళులర్పించింది కాబట్టి ప్రత్యేకంగా ఫ్లోర్ లీడర్లకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్. 


అయితే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు రాజ్యసభలో సంతాపం తెలిపే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసన తెలిపారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వ తీరును ఖండించారు. ప్రతీ ఎంపీకి ఒకట్రెండు నిమిషాలు టైమ్ ఇవ్వాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.