నీట్‌పై వాయిదా తీర్మానాలు.. ఇండియా కూటమి నిర్ణయం

నీట్‌పై వాయిదా తీర్మానాలు.. ఇండియా కూటమి నిర్ణయం

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నీట్ అంశాన్ని లేవనెత్తాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. దీనిపై లోక్ సభ, రాజ్యసభల్లో శుక్రవారం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. గురువారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ‘‘రేపు పార్లమెంట్ లో నీట్ పై చర్చ కోసం డిమాండ్ చేస్తాం. ఒకవేళ చర్చకు అనుమతించకపోతే నిరసన తెలుపుతం. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం నుంచి జరిగే చర్చలో పాల్గొనాలని నిర్ణయించాం” అని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించామని కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ తెలిపారు. నీట్ అంశంపై చర్చ కోసం పార్లమెంట్ లో నోటీసులు ఇస్తామని డీఎంకే ఎంపీ టి.శివ చెప్పారు.