అదానీ వ్యవహారంలో.. పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన

అదానీ వ్యవహారంలో.. పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన

అదానీ విషయంపై పార్లమెంట్ లో విపక్షాలు పట్టు వీడటం లేదు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభల్లో నిరసనలు తెలిపే సరికి.. స్పీకర్లు వాయిదా వేస్తున్నారు. ఇవాళ కూడా లోక్ సభ, రాజ్య సభలు మధ్యాహ్నం రెండు గంటలసేపు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి నిరసనలు తెలిపారు. బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. 

తృణముల్ ఎంపీలు కూడా ప్రత్యేక ఆందోళనలు చేపట్టారు. అదానీ అంశంపై మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. అదానీపై విచారణ చేపట్టకుండా.. మోడీ ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందని ఆరోపించారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివ‌సేన‌, జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్‌, ఆప్‌, ఎండీఎంకే పార్టీలన్నీ కలిసి ప్రతిప‌క్ష నేత మల్లిఖార్జున్ ఖ‌ర్గే తో భేటీ అయ్యారు.