ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా

ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా

దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వం పంజాబ్ కు అవసరమన్నారు ప్రధాని మోడీ. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపించాలంటున్న ప్రతిపక్షాల అజెండా అంతా పాకిస్థాన్ అజెండానేనని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( గురువారం) పంజాబ్ లోని ఫజిల్కా జిల్లాలోని అబోహర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు.

పంజాబ్ భద్రత, అభివృద్ధిపై చిత్తశుద్ధితో బీజేపీ మీ ముందుకు వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ఒకరు పంజాబ్ ను గతంలో లూటీ చేశారని, మరొకరు ఇప్పుడు ఢిల్లీలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలని, కానీ.. ఇప్పుడు కుస్తీపట్టినట్టు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ సోదరులను రానివ్వొద్దన్న పంజాబ్ సీఎం చన్నీపై ఫైర్ అయ్యారు. గురుగోవింద్ సింగ్, సంత్ రవిదాస్ ఎక్కడ పుట్టారంటూ చన్నీని ప్రశ్నించారు. గురుగోవింద్ సింగ్ బీహార్ లోని పాట్నా సాహిబ్ లో పుడితే.. సంత్ రవిదాస్ యూపీలోని వారణాసిలో పుట్టారని గుర్తు చేశారు. అంటే ఆ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలను రావద్దంటే.. వారిని అవమానించినట్టేనని అన్నారు. బీహార్, యూపీకి చెందిన వాళ్లు పనిచేస్తున్న రాష్ట్రం ఇదొక్కటే కాదని, ఇంకా చాలా ఉన్నాయని అన్నారు మోడీ.

మరిన్ని వార్తల కోసం..

మా ముగ్గురిని కూడా పెళ్లి చేసుకున్నాడు