ఇయ్యాల్నే పాట్నాలో ప్రతిపక్షాల భేటీ

ఇయ్యాల్నే పాట్నాలో ప్రతిపక్షాల భేటీ
  • బీఎస్పీ, బీజేడీ, బీఆర్​ఎస్ పార్టీలకు అందని ఆహ్వానం

న్యూఢిల్లీ : రాబోయే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం బీహార్​ రాజధాని పాట్నాలో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్​కు హాజరు కావాలని వివిధ పార్టీల నేతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్​ నితీశ్​ కుమార్ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ గురువారమే పాట్నా చేరుకున్నారు.

ఆర్జేడీ చీఫ్ ​లాలూ ప్రసాద్​ ను ఆమె కలిశారు. అయితే, ఈ మీటింగ్​కు హాజరుకానని బీఎస్పీ చీఫ్​ మాయావతి ట్వీట్​ చేశారు. ఈ మీటింగ్​కు మాయావతి(బీఎస్పీ)తో పాటు నవీన్ పట్నాయక్‌‌(బీజేడీ), కేసీఆర్​(బీఆర్​ఎస్​)లను పిలవలేదని జేడీయూ తెలిపింది.