గీతం స్టూడెంట్ కు ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీ

గీతం స్టూడెంట్ కు ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీ

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీ విద్యార్థిని, పరిశోధకురాలు జంగంపల్లి వర్ష ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపును పొందారు. ఎల్వీ ప్రసాద్​ ఐ ఇన్​స్టిట్యూషన్​ సహకారంతో గీతంలో ఆప్టోమెట్రీ కోర్సు నిర్వహిస్తున్న వర్షకు ఇండియన్​ విజన్​ ఇన్​స్టిట్యూట్​ బ్రియాన్​ హోల్డెన్​ యంగ్​ ఆప్టోమెట్రీ రీసెర్చర్​ రోలింగ్ ట్రోఫీని అందించింది. శుక్రవారం వర్షను గీతం వీసీ డీఎస్​ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్​ఆర్​ వర్మ, స్కూల్​ ఆఫ్ సైన్స్​ ప్రిన్సిపాల్​డాక్టర్​ మోతాహర్​ రెజా, ఎల్వీపీఈఐ అసోసియేట్​ డైరెక్టర్​ శ్రీకాంత్ ఆర్​ భరద్వాజ్​, రిజిస్ర్టార్​ విజయ్​ కుమార్​ అభినందించారు.

 దేశంలో పెరుగుతున్న కంటి సంరక్షణ డిమాండ్లను తీర్చగల ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి, వారి పరిశోధనలకు సహరించేందుకు ట్రోఫీ ప్రతిబింబిస్తుందని ఐవీఐ సీఈఓ వినోద్ డేనియల్​ పేర్కొన్నారు. వర్ష పరిశోధనలు భవిష్యత్​ ఆప్టోమెట్రీ మార్పులకు ఉపయోగపడుతాయని తెలిపారు. 

ఫార్మాస్యూటికల్​ రీసెర్చ్​లో విజయ్​ నాయక్​కు పీహెచ్​డీ 

గీతం స్కూల్​ ఆఫ్ ఫార్మసీ రీసెర్చ్ స్టూడెంట్ భూక్య విజయ్​ నాయక్​ను డాక్టరేట్ వరించిందని అసోసియేట్​ ప్రొఫెసర్​ దుర్గాప్రసాద్​ బేడా తెలిపారు. విజయ్​ నాయక్​ ఇక్సాజోమిబ్​ సిట్రేట్, పనోబిస్టాట్​ ప్రసుగ్రెల్​ వంటి క్లిష్టమైన ఔషదాల డీపీల వర్గీకరణపై అధునాతన పరిశోధనలు చేశాడని, పీపీఈ పద్దతిని ఉపయోగించి అతి తక్కువ మందం గల ప్లాస్మా నమూనాలతో విజయవంతంగా ప్రాసెస్​ చేసి నిరూపించినట్లు వివరించారు. స్థిరమైన ఔషధ పరిశోధనకు కృషి చేసి డాక్టరేట్​ సాధించిన విజయ్​ నాయక్​ను గీతం వీసీ, రెసిడెంట్ డైరెక్టర్, స్కూల్​ ఆఫ్​ ఫార్మసీ ప్రిన్సిపాల్ అభినందించారు.