ఆర్గానిక్ సేల్స్ పెరిగినయ్​

ఆర్గానిక్ సేల్స్ పెరిగినయ్​

సిటిజన్స్​ ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: కరోనా సిటిజన్స్​లో చాలా మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా హెల్త్​ కాన్షియస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యునిటీ పవర్ పెంచుకుని, మరింత హెల్దీగా ఉండాలని ఎక్కువమంది భావిస్తున్నారు. ఆ క్రమంలో ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ డేస్ తో పోలిస్తే  30 శాతం బిజినెస్ పెరిగిందని ఆర్గానిక్ స్టోర్స్​ నిర్వాహకులు చెప్తున్నారు.

పెరుగుతున్న హెల్త్ కాన్షియస్..

సిటీలో వందల్లో ఆర్గానిక్ స్టోర్స్ ఉండగా, లాక్​డౌన్​కు ముందు ఓ గ్రూప్ వారు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ​ప్రొడక్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కెమికల్ ఫ్రీ, హెల్దీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తో పాటు నిత్యవసరాలూ కొంటున్నారు. నార్మల్​ ప్రొడక్ట్​తో పోలిస్తే ధర డబుల్​ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కో స్టోర్​కు డైలీ 50నుంచి60మంది కస్టమర్స్​ వస్తుంటారని నిర్వాహకులు చెప్తున్నారు. మరికొందరు ఆన్​లైన్​లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ గుడ్ సీడ్స్ ఆర్గానిక్ లివింగ్ స్టోర్ నిర్వాహకుడు నారాయణమూర్తి తెలిపారు.

ప్రస్తుతం బయటి రాష్ట్రాల నుంచి..

శివార్లలోని షాద్ నగర్, చేవెళ్ల, శంకరపల్లి, మేడ్చల్ నుంచి సిటీలోని ఆర్గానిక్ స్టోర్స్ కి వెజిటబుల్స్, ఫ్రూట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఎండల వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయి దిగుబడి తగ్గడంతో బెంగళూరు, మైసూర్ నుంచి ప్రొడక్ట్స్ తెప్పిస్తున్నారు. నాలుగైదు స్టోర్ల నిర్వాహకులు కలిసి ట్రక్ మాట్లాడుకుని వారంలో 2–3 సార్లు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంపోర్ట్​ చేసుకుంటున్నారు. ఒక్కో రకం వెజిటబుల్స్ 2 నుంచి 3 క్వింటాళ్లు ఉంటాయని, అలా 25 రకాలు తెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే ధరలు 20 –25 శాతం పెరిగాయంటున్నారు. ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చు కూడా మూడింతలవడంతో ప్రొడక్ట్స్ రేట్లు పెంచాల్సి వస్తోందని చెప్పారు. బయటి ఫామ్స్ నుంచి తెప్పించి అమ్మేవారితోపాటు సొంతంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను పండించి సేల్ చేసేవారూ సిటీలో ఎంతోమంది ఉన్నారు. వారు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఆర్గానిక్ మెథడ్ లో వెజిటబుల్స్ సాగు చేస్తూ.. సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ స్టోర్స్ లో అమ్ముతున్నారు.

బెనిఫిట్స్ తెలుసుకుంటూ..

ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సిటిజన్స్​ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ తెలుసుకుంటున్నరు. యంగ్ స్టర్స్, మిడిల్ ఏజ్ గ్రూప్, కార్పొరేట్, ఐటీ సెక్టార్ ఇట్ల డిఫరెంట్ కేటగిరీల వాళ్లు ఆర్గానిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. శామీర్ పేట, సిద్దిపేట దగ్గర మాకు ఫామ్స్ ఉన్నయ్. అక్కడ పండించిన ఆర్గానిక్ వెజిటబుల్స్ ను సిటీతోపాటు బెంగళూరు, ముంబయి, పుణెలో సేల్ చేస్తుంటం.                                                                            –సచిన్ దర్బార్వర్, సీఈవో, సింప్లీ ప్రెష్ ఆర్గానిక్ స్టోర్

పరిస్థితులు మారినయ్

నేను, నా భర్త ఐటీ జాబ్ చేస్తుంటం. ఇంతకుముందు  మార్కెట్స్ కి వెళ్లి వారానికి సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉండటంతో మార్కెట్ కి వెళ్లడం బంద్ పెట్టినం. సేఫ్టీ, హెల్త్​ను దృష్టిలో పెట్టుకుని ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకుంటున్నం.                                                    -నక్షత్ర, ఐటీ ఎంప్లాయ్, మాదాపూర్

బిజినెస్ పెరిగింది

ఒకప్పుడు రెగ్యులర్ కస్టమర్ల నుంచి మాత్రమే ఆర్డర్స్ వస్తుండే. ఇప్పుడు కొత్త కస్టమర్స్ జాయిన్ అయిన్రు. ప్రస్తుతం ఎక్కువగా బయట ప్రాంతాల నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెప్పిస్తున్నం.

                                                                                               -నారాయణ మూర్తి, గుడ్ సీడ్స్ ఆర్గానిక్  లివింగ్

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..