
- ఎమ్మెల్యేపై చర్యకు వినతి
- ఆరిజిన్ సీఈవో శేజల్ వెల్లడి
హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీలో ఆమె ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో చేర్చగా కోలుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించారు. తనకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె సీబీఐ గడప తొక్కారు. సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.