oscars 2023 Updates : ఆస్కార్ 2023 లైవ్ అప్ డేట్స్

oscars 2023 Updates : ఆస్కార్ 2023 లైవ్ అప్ డేట్స్

చరిత్రలో మరుపురాని పాటగా నిలిచిపోతుంది : మోడీ 

ఈ ఏడాది బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటునాటు పాటకు అవార్డును అందుకున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలపారు.  చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని, ఏళ్ల తరబడి ఈ పాటను గుర్తు చేసుకుంటూనే ఉంటారని మోడీ  కితాబిచ్చారు. కీరవాణి, చంద్రబోస్‌లతో పాటు మొత్తం చిత్ర బృందానికి  ఈ సందర్భంగా మోడీ​ అభినందనలు తెలిపారు. అదేవిధంగా బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్ర బృందాన్ని కూడా  మోడీ అభినందించారు. 

నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది : కేసీఆర్‌ 

నాటునాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని, తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పాట ద్వారా తెలుగులోని మట్టి వాసనలను గీత రచయిత చంద్రబోస్‌ వెలుగులోకి తీసుకొచ్చారని కేసీఆర్‌ అన్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇవాళ పండగ రోజని, ఆస్కార్‌ స్ఫూర్తితో ఇదే ఒరవడి కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. 

తెలుగు జెండా రెపరెపలాడుతోంది : జగన్ 


నాటునాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని ట్వీట్ చేశారు. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల తాను గర్వపడుతున్నాను, ఈ రోజు అంతర్జాతీయంగా దానికి తగిన గుర్తింపు లభించిందని జగన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలను, భారతీయులందరికీ గర్వకారణంగా చేసినందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు తెలపారు. 

ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారు :  నాగార్జున 

‘భారతీయ సినిమాకు ఇదొక చారిత్రక ఘట్టం’ అని అన్నారు. సినీ అభిమానులనే కాదు, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని కితాబిచ్చారు.

వందల కోట్ల భారత గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి : చిరంజీవి 

ఆస్కార్ అనేది ఇప్పటివరకు ఇండియాకు కలగా ఉండేది.. కానీ రాజమౌళి తన విజన్, దైర్యంతో దాన్ని సుసాద్యం చేశాడు. వందల కోట్ల భారత గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. నాటునాటు పాట ప్రపంచ అగ్రస్థానన నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ 

ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ అభినందనలు


బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేశారని అన్నారు.

‘నాటు నాటు’కు ఆస్కార్‌

  • తెలుగోడి ప్రతిభకు ఆస్కార్‌ పట్టం కట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు దక్కింది.
 

 

  • తెలుగోడి ప్రతిభకు ఆస్కార్‌ పట్టం కట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్  ఆవార్డును అందుకున్నారు. దక్షిణాది నుంచి ఆస్కార్‌ గెలుచుకున్న తొలి సినిమాగా  ఆర్ఆర్ఆర్ నిలిచింది. నాటు నాటు పాటకు చంద్రబోస్  లిరిక్స్ అందించగా, కీరవాణి  మ్యూజిక్ అందించారు. సింగర్స్ కాలబైరవ, రాహుల్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీలో  హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డ్యాన్స్ తో పాటను ఇంకో లెవల్ కు తీసుకెళ్లారు. వీరందరి ప్రతిభతో పాటుగా రాజమూళి డైరక్షన్ పాటను ఆస్కార్‌ అందుకునేలా చేసింది. 
  •  

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో అవతార్ ద వే ఆఫ్ వాటర్  చిత్రానికి ఆస్కార్ లభించింది. 

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా  ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ నిలిచింది.  మహిళా డైరక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించింది. ఆస్కార్ అవార్డులో కార్తీకి ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు.  షార్ట్ ఫిల్మ్  విభాగంలో భారత్ కు దక్కిన తొలి ఆస్కార్ ఇదే కావడం విశేషం. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌  గతేడాది డిసెంబర్ లో నెట్‌ఫ్లిక్స్‌లో  రిలీజైంది.

 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా  ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ నిలిచింది. 
ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును జేమ్స్‌ ఫ్రెండ్‌ సొంతం చేసుకున్నారు. ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ చిత్రానికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది


ఆస్కార్ స్టేజీపై నాటు నాటు ఫెర్ఫామెన్స్ 
వేదికపై పాట పాడిన రాహుల్, కాలబైరవ
లాల్చీ, పంచకట్టులో కనిపించిన సింగర్స్ 

 ఆల్ దట్ బ్రీత్స్ కి ఆవార్డు మిస్

బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ లో నామినేట్ అయిన  ఆల్ దట్ బ్రీత్స్ కి ఆవార్డు దక్కలేదు. ఈ కేటగిరీలో ఆమెరికాకి చెందిన నావల్నీ బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు దక్కించుకుంది. ఇద్దరు అన్నదమ్ముల కథగా తెరకెక్కిన ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి షానన్ సేన్ దర్శకత్వం వహించారు. 

ప్రతిష్టాత్మిక ఆస్కార్ అవార్డు వేడుకలు ప్రారంభం అయ్యాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ తో అవార్డులు మొదలయ్యాయి.  ఇప్పటివరకు 3 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గానూ రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ కె  హుయ్‌ క్వాన్‌, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్  జెమలీ కర్టిన్స్  అవార్డులు  అందుకున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా పినాకియా నిలిచింది. బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‏గా నవల్నీ  అవార్డు గెలుచుకుంది.  బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆన్ ఐరిష్ గుడ్ బై చిత్రం ఆస్కార్ అవార్డు దక్కింది. 

 బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ కె  హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్  జెమలీ కర్టీన్స్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‏ (నవల్నీ )
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ (ఐరిష్ గుడ్ బై) 
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ 
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ‌‌ ద వేల్ మేకప్ టీమ్ 
 బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ( పినాకియా)