ఆల్ టైం రికార్డ్: 70కోట్ల మంది OTT చూశారు..మాస్ పీపులే ఎక్కువ

ఆల్ టైం రికార్డ్: 70కోట్ల మంది OTT చూశారు..మాస్ పీపులే ఎక్కువ

గత కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగంలో భారత్ సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023 ప్రకారం.. 707 మిలియన్లు (70.7 కోట్లు)  మంది ఇంటర్నెట్ వినియోగ దారులు ఓవర్ ది టాప్ (OTT) , ఇంటర్నెట్ ద్వారా ఆడియో, వీడియో సేవలను వినియోగించుకున్నారు. 

దేశవ్మాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 90  వేల కుటుంబాలను సర్వే  చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) డేటా అనలిటిక్స్ సంస్థ కాంతర్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించి నివేదికను రూపొందించారు. ఈ సర్వేలో OTT రికార్డు స్థాయిలో వినియోగ దారుల పెరుగుదలను చూసింది. డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ రాకముందు సాధారణంగా సినిమాలను చూసేందుకు థియేటర్లు, టీవీల్లో చూసేవాళ్లం.. ఆడియో అయితే సిడీలు కొని వినేవాళ్లం.. ప్రస్తుతం  దీనికి భిన్నంగా OTT  పై ఆధారపడుతున్నారు. OTT ద్వారా సాంప్రదాయేతర స్ట్రీమింగ్ పరికరాల అయిన మొబైల్, ఆండ్రాయిడ్ టీవీల్లో డిజిటల్ వినోదం కోసం ఎక్కువ మంది చూడటం ప్రారంభించారు. 

నివేదిక ప్రకారం..స్మార్ట్ టీవీలు, స్పీకర్లు, స్ట్రీమింగ్ స్టిక్ లు , ప్లేయర్లు వంటి స్మార్ట్ డివైజ్ ల వినియోగం 2021 నుంచి 2023 వరకు 58 శాతం పెరిగింది. వండర్ ఏమిటంటే.. సంప్రదాయ టీవీలపై ఆధారపడిన 181 మిలియన్ల మంది  సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం చేస్తుంటే.. ఈ ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాలను వినియోగించిం OTT  ద్వారా 208 మిలియన్ల మంది కస్టమర్లు వీడియో కంటెంట్ చూస్తున్నారు. OTT  తర్వాత సోషల్ మీడియా, కమ్యూనికేషన్లు ఆన్ లైన్ వినియోగంలో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇందులో OTT సభ్యత్వం ద్వారా వీడియోలు, ఆడియోలు, కస్టమర్లు రూపొందించిన వీడియో, ఆడియోలు ఉన్నాయి. కమ్యూనికేషన్ విభాగంలో మేసేజ్ లు, ఈమెయిల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ లు ఉన్నాయి. 

మరోవైపు 2023  ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య  820 మిలియన్లు దాటింది. కోవిడ్ పాండమిక్ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా తగ్గింది. అయినా 50 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు పెరగడం రికార్డు. ప్రాంతీయ భాషలను లక్ష్యంగా చేసుకోవడంతో ఇంటర్నెట్ వినియోగదారులు భారీ స్థాయిలో పెరిగారు. 

ఈ రికార్డులో గ్రామీణ భారతీయులు ఎక్కువగా ఉండటం విశేషం. 50 శాతానికి పైగా గ్రామీణులే. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగంలో మన గ్రామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.