కొత్త చట్టంతో మన ఎవుసం మారిపోతది

కొత్త చట్టంతో మన ఎవుసం మారిపోతది

గ్లోబల్‌ పవర్‌‌గా ఇండియా

మండీలలో పోటీ వాతావరణం.. అన్ని ఛార్జీలు పోతాయ్

ఆర్థికంగా రైతులకు ప్రయోజనం -నీతి ఆయోగ్ మెంబర్ రమేశ్

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన మూడు చట్టాలు రూరల్ ఎకానమీలో సమూల మార్పులు తీసుకొస్తాయని నీతి ఆయోగ్ మెంబర్, అగ్రికల్చర్ నిపుణుడు రమేశ్ చంద్ అన్నారు. ఈ చట్టాలు ఇండియన్ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ను సరికొత్త స్థాయిలకు తీసుకెళ్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను ఆయన కొనియాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు పాలసీ సంస్కరణలు రైతులకు, వ్యవసాయంలో మారుతోన్న అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి’ అని చంద్ చెప్పారు. ఈ సంస్కరణలు ఇండియాను వ్యవసాయంలో  గ్లోబల్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దనున్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ ఫుడ్ సప్లయికు పవర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌గా కూడా మార్చనున్నాయని అన్నారు. ఇటీవలే కేంద్రం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్, 2020, ఫార్మర్స్(ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్, ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020ను, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020ను తీసుకొచ్చింది. ఈ బిల్లుల జారీ విషయంలో ప్రతిపక్షాల నుంచి, కొన్ని వర్గాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా వీటిని యాక్ట్‌‌‌‌గా మార్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు న్యాయమే జరుగుతుంది, తప్ప ఎటువంటి నష్టం జరగదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ ద్వారా రైతులు తాము పండించిన పంటలను అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) మార్కెట్లలో లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులకు, ఇంటిగ్రేటర్స్‌‌‌‌కు, పార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లకు, కోఆపరేటివ్‌‌‌‌లకు అమ్ముకోవచ్చు. డిజిటల్ ప్లాట్‌‌‌‌పామ్ ద్వారా కూడా రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పంట అమ్మకాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను ఏర్పాటు చేయొచ్చు. పాన్‌‌‌‌ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వ్యవసాయ సహకార సంస్థలు ఇలాంటివి ఏవైనా ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌పామ్‌‌‌‌ను ఏర్పాటు చేయొచ్చు. పంట పండించిన ప్లేస్ నుంచే అమ్మకం చేసుకోవచ్చు. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం  చెబుతోంది. చంద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

ఎంఎస్‌‌‌‌పీ(మినిమమ్ సపోర్ట్ ప్రైస్)ను ఈ చట్టాలు తొలగించవని, ఈ చట్టాల వల్ల ఏపీఎంసీ మార్కెట్లకు ఎలాంటి ప్రమాదం లేదని క్లారిటీ ఇచ్చారు.అయితే ఈ మార్కెట్లలో రాష్ట్రాలు విధిస్తోన్న అధిక, అన్యాయమైన ఛార్జీలను మాత్రం నిరోధిస్తాయని చంద్ వివరించారు. ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టేట్, ఇంట్రా  స్టేట్ ట్రేడ్‌‌‌‌ను ఈ చట్టాలు ప్రోత్సహిస్తాయి. రైతులకు తమ పంటలను అమ్ముకునేందుకు మరిన్ని ఛాయిస్‌‌‌‌లు ఉంటాయి. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ ఏపీఎంసీ మండీలు, ఇతర ఛానల్స్‌‌‌‌లలో ఆరోగ్యకరమైన పోటీని తీసుకొస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోటీకరమైన వాతావరణంలో రైతులు ఆర్థికంగా లబ్ది పొందుతారని చంద్ అన్నారు.

ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెరుగుతాయ్!

ఫార్మర్స్ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్‌‌‌‌పై మాట్లాడిన చంద్.. క్వాలిటీ ప్రొడక్షన్‌‌‌‌ను ఇది ప్రమోట్ చేస్తుందన్నారు. అంతేకాక ఆసక్తిగల కన్జూమర్లకు డైరెక్ట్‌‌‌‌గా పండించిన పంటలను అమ్ముకోవచ్చని, ఎక్స్‌‌‌‌పోర్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌లోకి కొత్త క్యాపిటల్‌‌‌‌, కొత్త తరం వస్తుందని, వాల్యు చెయిన్‌‌‌‌లో రైతుల భాగస్వామ్యానికి మార్గం సుగమం అవుతుందన్నారు.  పంట వేయడాని కంటే ముందే రైతులు, కొనుగోలుదారుల మధ్య ఒప్పందం కుదుర్చుకునే వీలును కూడా కల్పిస్తుంది.  ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్‌‌‌‌లో చేసిన మార్పులతో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌లోకి ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను పెంచవచ్చని చంద్ చెప్పారు. అంతేకాక పంట పండించడం నుంచి అమ్మడం వరకున్న ప్రాసెస్‌‌‌‌లో విధిస్తోన్న అన్ని రకాల ఛార్జీలను, లెవీలను ఈ చట్టాలు తొలగిస్తాయి. వీటి వల్ల రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందే తప్ప నష్టమైతే ఉండదని చంద్ క్లారిటీ ఇచ్చారు. ‑రమేశ్ చంద్, నీతి ఆయోగ్ మెంబర్