కలెక్షన్లు అదిరిపోయాయ్‌

కలెక్షన్లు అదిరిపోయాయ్‌

బాలీవుడ్​ వెనకబాటు.. దక్షిణాది జోరు..
బెస్ట్​ ఇయర్‌‌గా 2023!

వెలుగు బిజినెస్​ డెస్క్​ : కరోనా మహమ్మారి దెబ్బకి పడిపోయిన మన బాక్సాఫీస్​ కలెక్షన్లు మళ్లీ 2022లో పుంజుకున్నాయి. కిందటేడాది మొత్తం మీద బాక్సాఫీస్​ కలెక్షన్లు రూ. 10 వేల కోట్ల మార్కును దాటేశాయి.  కరోనాకి ముందు 2019లో వచ్చిన బాక్సాఫీస్​ కలెక్షన్లు రూ. 10,948 కోట్ల తర్వాత 2022 కలెక్షన్లు రూ. 10,637 కోట్లే ఎక్కువ. ఎక్కువగా పెద్ద  హిందీ సినిమాలు రిలీజ్​ కాకపోయినా ఈ కలెక్షన్లు రావడం విశేషమని గ్రూప్​ఎం–ఒర్మాక్స్​ మీడియా రిపోర్టు వెల్లడించింది. అంతేకాదు, కిందటేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లు కూడా మూతపడ్డాయని, కానీ, కలెక్షన్లు ఈ రేంజ్​లో పుంజుకున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 

కంటెంట్​ పైప్​లైన్​ ప్రకారం చూస్తే 2023 ఇంతకంటే బాగుంటుందని ఒర్మాక్స్​ మీడియా సీఈఓ శైలేష్​ కపూర్​ చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల పాటు దేశీయంగాను, హాలీవుడ్​ పరంగానూ ఇబ్బందులపాలయిన సినిమా ఇండస్ట్రీ సాధారణ స్థితికి వచ్చిందని అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్​సినిమాలకు తోడు రీజినల్​ సినిమాల కంటెంట్​ పైప్​లైన్​ అద్భుతంగా ఉందని, దీంతో 2023 సినిమా ఇండస్ట్రీకి బెస్ట్​ ఇయర్​ అవుతుందని కపూర్​ పేర్కొన్నారు. 2023 లో బాక్సాఫీసు కలెక్షన్లు అన్ని రికార్డులను బద్దలు కొడతాయని, రూ. 11 వేల నుంచి రూ. 12 వేల కోట్లకు చేరుకుంటాయని కపూర్​ అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్​ కలెక్షన్లపరంగా 2023 కచ్చితంగా ముందుంటుందని ఇంటరాక్టివ్​ టెలివిజన్ (గ్రూప్​ ఎం)​ మేనేజింగ్​ డైరెక్టర్​ అజయ్​ మెహతా అంచనావేశారు. హిందీలోకి డబ్ చేసిన దక్షిణాది సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

2022లో హిందీ ఫిల్మ్​ ఇండస్ట్రీలో కొన్ని  కీలక  ట్రెండ్స్​ గురించి జంగ్లీ పిక్చర్స్​ సీఈఓ అమ్రితా పాండే ప్రస్తావించారు. థియేటర్లలో అన్ని జానర్స్​ సినిమాలు బాగా ఆడటం ఒకటైతే, స్టార్​ డ్రివెన్​ సిస్టమ్​ నుంచి కంటెంట్​ డ్రివెన్​ సిస్టమ్​గా మారడం రెండోదని పాండే పేర్కొన్నారు. సినిమాను రిఫ్లెక్ట్​ చేసేలా మాత్రమే ట్రయలర్లు ఉండాలన్నారు.హిందీలో దుమ్ములేపిన డబ్బింగ్ సినిమాలు 2022 కలెక్షన్లలో హిందీ సినిమాల (డబ్బింగ్‌ మూవీస్‌తో కలిపి) వాటా 33 శాతమైతే, తెలుగు సినిమాలు 20 శాతం, తమిళ్ సినిమాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. సినిమాలవారీగా చూస్తే కేజీఎఫ్​ చాప్టర్​ 2 రూ. 970 కోట్లతో టాప్​లో నిలవగా, రూ. 869 కోట్లతో ఆర్ఆర్​ఆర్​ రెండో ప్లేస్​లో, రూ. 471 కోట్లతో అవతార్​ 2 మూడో ప్లేస్​లో నిలిచాయి. అయితే 2019 తో పోలిస్తే హిందీ, హాలీవుడ్​ సినిమాలు అంతగా సక్సెస్​కనబరచలేదని ఈ రిపోర్టు పేర్కొంది. మరోవైపు తెలుగు, కన్నడ సినిమాల నాయకత్వంలో దక్షిణాది సినిమా పరిశ్రమ మాత్రం 2019 కలెక్షన్లను దాటేసిందని వివరించింది. 2019 తో పోలిస్తే హిందీ సినిమాల కలెక్షన్లు 27 % తగ్గి రూ. 3,513 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. తెలుగు​ బాక్సాఫీసు కలెక్షన్లు మాత్రం 53% ఎక్కువై రూ. 2,145 కోట్లకు, తమిళ్​ బాక్సాఫీస్​ కలెక్షన్లు 18 % పెరిగి రూ. 1,724 కోట్లకు చేరినట్లు రిపోర్టు తెలిపింది. 

గ్రాస్​ బాక్సాఫీస్​ కలెక్షన్లు ....
2022    రూ. 10,637 కోట్లు
2019    రూ. 10,948 కోట్లు
తెలుగు  సినిమాలు    20 శాతం
తమిళ్​ సినిమాలు    16 శాతం
ఎక్కువ కలెక్షన్లు తెచ్చిన సినిమాలు....
కేజీఎఫ్​చాప్టర్​2    రూ. 970 కోట్లు
ఆర్​ఆర్​ఆర్​    రూ. 869 కోట్లు
అవతార్​2    రూ. 471 కోట్లు