వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా హైదరాబాద్ కుర్రాడు

వరల్డ్  ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా హైదరాబాద్ కుర్రాడు

క్యూబ్ రూట్ ఆఫ్ 353 ఎంత..? ఠక్కున ఆన్సర్ చెపితే గణితంలో దిట్ట. అంత కంటే స్పీడ్గా కంప్యూటర్ వేగంతో 7.06737661472…. వరుసగా 19 డిజిట్ల వరకు ..ఠక ఠక సమాధానం చెపితే అది ప్రపంచ రికార్డు. అచ్చంగా ఆ ఘనతను సాధించి చూపించాడు.. మన హైదరాబాదీ కుర్రాడు నీలకంఠ భాను. అంతర్జా తీయ వేదికపై తన అద్భుత ప్రతిభను ప్రదర్శించి గతంలో శకుంతలాదేవి,, స్కాట్ ఫ్లాన్స్ బర్గ్ సాధించిన లెక్కల రికార్డు లను బద్దలు కొట్టాడు. ప్రపంచంలో గణిత మేధావులను నివ్వెరపరిచిన మ్యాథ్స్  మాంత్రికుడు నీలకంఠం భాను..

‘మా నేటివ్ ప్లే స్ హైదరాబాద్. నాన్న జొన్నలగడ్డ శ్రీ నివాస్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ప్రమోటర్. అమ్మ హేమ శివ పార్వతి . ఐదేళ్లవయసులో(2005) ఓ రోడ్డుప్రమాదంలో నా మెదడుకు తీవ్ర గాయమైంది. ఐదు రోజులు స్పృహ కోల్పోవడంతో పాటు 74 కుట్లుపడ్డాయి. దాదాపు ఏడాది బెడ్రెస్ట్తీసుకోవాల్సి వచ్చింది. ఈ టైమ్‌లో నాన్న కొన్ని మ్యాథ్స్ పజిల్స్ ఇచ్చిచేయమనేవారు. అప్పటి నుంచిమ్యాథ్స్‌పై ఇంట్రె స్ట్ పెరిగింది. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యు లేషన్స్ పై కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్స్టీ చేయడం మొదలు పెట్టా’ భారతీయ విద్యా భవన్ పబ్లి క్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్న. ఇంటర్ రామయ్య ఐఐటీ స్ట డీ సర్కిల్ లో పూర్తి చేశా. ప్రస్తుతం ఢిల్లీలోని సెయింట్ స్టిఫెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న. స్కూల్ డేస్ నుంచే తోటి స్టూడెంట్స్  కు మ్యాథ్స్‌ క్లాస్లు చెప్పే చాన్స్ వచ్చింది. 2011, 2012లలో బెంగళూరు, పూ ణేల్లో జరిగిన నేషనల్ అబాకస్ అండ్ మెంటల్ అర్తమేటిక్  పోటీల్లో చాంపియన్షిప్ సాధించా. సింగపూర్లో సిప్అకాడమీ నిర్వహించిన అబాకస్ అండ్ మెంటల్ అర్థమెటిక్  ఇంటర్నేషనల్ 2013 పోటీల్లోనూ విన్ అయ్యా. 2014 జూన్ 2న జరిగిన హైస్పీడ్ మెంటల్ మ్యాథ్స్క్యాటగిరిలో 21 లిమ్కారికార్డులు బ్రేక్చేశా. నాకు రికార్డులంటే పెద్దగా పట్టింపు లేదు. గణితవేత్తలు, హ్యూమన్ కాలిక్యు లేట ర్‌లతో ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్న. ఇప్పటి స్టూడెంట్స్కు మ్యాథ్స్ అంటే చాలా అపోహ లున్నాయి. అంకెలు అంటేనే భయపడిపోతున్నారు. టీచింగ్ మెథడ్‌లో మార్పులు రానంతవరకు ఇలానే ఉంటుంది. పిల్లల్లో మ్యాథ్స్ ఫోబియా పోగొట్టేం దు కు 2018లో ‘ఎక్స్ ఫ్లోరింగ్ ఇన్ఫినిటీస్’ అనే స్టార్టప్  ప్రారంభించాం. స్కూళ్లలో  వర్క షాప్‌లు నిర్వహించి అర్థమెటిక్ సమస్యలతో పిల్లల మేధస్సుకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నా… తెలంగాణ, టీ-శాట్ నెట్‌వర్క్ తో కలిసి ఆరు- నుంచి పది తరగతుల వారికి 700 గంటల మ్యాథ్స్ కంటెంట్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

మెంటల్క్యాలిక్యులేషన్ వరల్డ్చాంపియన్షిప్ 1998 నుంచి లండన్ 06 లోని ‘మైండ్ స్పోర్ స్ ట్ ఒలింపియాడ్’లో జరుగుతోంది. ఈ ఏడాది కరోనా వైరస్ తీవ్రత వల్ల ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా మైండ్ స్పోర్ స్ ట్లో సత్తా చాటిన వారందరినీ ఆహ్వానిస్తారు. ఆగస్టు 15న జరిగిన ఈ కాంపిటీషన్‌లో యూకే, జర్మనీ, యూఏఈ, ఫ్రాన్స్, గ్రీస్, లెబనాన్ సహా 13 దేశాల నుంచి పాల్గొన్న 30 మందితో పోటీ పడ్డాను. ఇచ్చిన లెక్కలన్నింటికీ వెనువెంటనే ఆన్సర్స్ ఇవ్వడంతో న్యాయనిర్ణేతలు మరింత కఠినమైన ఈక్వేషన్లు ఇచ్చారు. క్యూబ్రూట్ తరహా సమస్యలు ఇచ్చి పరిష్కరించమన్నారు. వాటికి సమాధానం చెప్పి ప్రత్యర్థి కంటే 65 పాయింట్ల ఆధిక్యంతో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నా. అకడమిక్ ఇయర్పూర్తయిన వెంటనే ఎక్స్ ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ స్టార్టప్ ద్వారా మ్యాథ్స్ లెర్నింగ్ను సులభతరం చేసేందుకు కృషి చేయాలనుకుంటున్న. గణితంలో ఇంకా సంప్రదాయ బోధనాపద్ధతులనే వాడుతున్నారు. అలా కాకుండా మ్యాథ్స్ను పిల్లలు ఎంజాయ్ చేస్తూ.. ఆసక్తిగా నేర్చుకునేలా కొత్త పద్ధతులు రావాలి.