మన ఊరు మన బడి పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌

మన ఊరు మన బడి పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌
  • ప్రతి గ్రామంలో ప్లే గ్రౌండ్‌ నిర్మించాలి
  • మన ఊరు మన బడి పనుల్లో నాణ్యత పాటించాలి
  • సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవోలు, సంబంధిత ఆఫీసర్లు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. గ్రామాల్లో ఆట స్థలాలు, మొక్కల పెంపకం, ఉపాధి హామీ పనులు, దళిత బంధు, మన ఊరు మన బడి పనులపై శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌‌‌‌‌‌‌‌ రెండో విడతలో భాగంగా కిచెన్‌‌‌‌‌‌‌‌ గార్డెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌ 2023 కింద ఈ నెల 31 లోపు విలేజ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ చేసేలా చూడాలని సెక్రటరీలను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లో, ప్రతి హ్యాబిటేషన్‌‌‌‌‌‌‌‌లో ఆట స్థలాలు ఏర్పాటు చేసి, వాటిని యువత వినియోగించుకునేలా చూడాలన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆట స్థలాలు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మన ఊరు మన బడి పనులు క్వాలిటీగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఏపీడీ పెంటయ్య, డీపీవో యాదయ్య, డీఎల్‌‌‌‌‌‌‌‌పీవో సాంబిరెడ్డి, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ లచ్చిరాంనాయక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఎం కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌ నాగేందర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ప్రతి మండలంలో గ్రీన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ సాధించాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ జిల్లాలోని ప్రతి మండలంలో గ్రీన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ సాధించాలని అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించడంతో పాటు, మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ తయారు చేయాలని సూచించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి హరితహారం, నర్సరీలు, స్వచ్చ భారత్ మిషన్, ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, సెగ్రిగేషన్‌‌‌‌‌‌‌‌ షెడ్లు వంటి అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నర్సరీల పరిస్థితి నిరాశాజనకంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 19లోగా నర్సరీలకు అవసరమైన పాలిథీన్‌‌‌‌‌‌‌‌ సంచులను అందుబాటులోకి తెచ్చుకొని, 50 శాతం బ్యాగ్‌‌‌‌‌‌‌‌ ఫిల్లింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయాలని  ఆదేశించారు. ఆట స్థలాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో డీఆర్డీవో కాళిందిని, డీపీవో విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.