రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందు డబ్బాతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందు డబ్బాతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన

ఎల్లారెడ్డిపేట,వెలుగు: తమను కొనసాగించాలని పురుగు మందు డబ్బాతో నలుగురు నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ స్కూల్ లో  ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ల్యాబ్ అసిస్టెంట్ నిర్మల, కుకింగ్ మాస్టర్ బాలు, ఏఎన్ఎం, సుజాత  పదమూడేండ్లుగా పని చేస్తున్నారు. 

తమ స్థానాల్లో నోటిఫికేషన్ ద్వారా కొత్తవాళ్లను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తిరిగి తమనే కొనసాగించాలని మంగళవారం స్కూల్ వద్ద బైఠాయించి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా తమను తొలగించారని బాధితులు వాపోయారు. 

ఘటనపై ప్రిన్సిపల్ మంజిత్ ను వివరణ కోరగా.. సక్రమంగా విధులు నిర్వహిస్తలేరనే కారణంతో కలెక్టర్ ఆదేశాలతోనే తొలగించినట్టు తెలిపారు.