యుద్ధంలో 1300 మంది ఉక్రెయినియన్లు మృతి

యుద్ధంలో 1300 మంది ఉక్రెయినియన్లు మృతి

ఉక్రెయిన్, రష్యాల మధ్య 17 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు సిటీలను రష్యన్ బలగాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ సిటీని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ తమ రాజధానిని కాపాడుకునేందుకు శాయశక్తులూ ఒడ్డుతోంది. సైనికులతో పాటు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతబట్టి కొట్లాడుతున్నారు. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1,300 మంది ఉక్రెయినియన్లు మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఫిబ్రవరి 24న యుద్దం మొదలైనప్పటి నుంచి తమ వారి మరణాలపై జెలెన్స్కీ స్పందించడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా రష్యన్ సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించించింది.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి మరో 20 ఏండ్లు ఢోకా లేదని పీకేనే చెప్పిండు

జనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే

ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు