2కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్

2కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్

రెండుకోట్ల మంది టీనేజర్లకు కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. 15-18 ఏళ్ల మధ్య ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.  "యువ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పై స్థాయికి తీసుకువెళుతోంది" అని మంత్రి ట్వీట్ చేశారు.  టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్‌ టీకాలు తీసుకుంటున్నారని ఆరోగ్యమంత్రి తెలిపారు. 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి కొవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రికాషనరీ డోస్‌ సైతం వేసింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్‌ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం మేరకుఒకే వయస్సులో ఉన్న 70 శాతం మంది ఇప్పటివరకు COVID-19 వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను పొందారన్నారు. ఇప్పటివరకు 1,74,64,99,461 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. మరోవైపు  దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.  ఇప్పటికే కరోనా నిబంధనలపై సమీక్షించాలని, సవరించాలని లేదా తొలగించాలని కేంద్రం  ... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.  మరోవైపు గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 25,920 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, నిన్నటి కంటే 4,837 తక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక కరోనా బారిన పడి తాజాగా 492 మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య  510,905 కు చేరింది. 

ఇవి కూడా చదవండి:

విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. హోండా ఆక్టివా సీజ్

ఈ దేశాల్లో కరోనా కేసు ఒక్కటీ నమోదు లేదు