గుజరాత్‌లోని నవ్‌సారిలో భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆదివారం అధికారులు జరిపిన దాడిలో 3 వేల కిలోల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఖర్చులు తగ్గించుకునేందుకు నెయ్యిలో పామాయిల్ కలిపారని గుర్తించారు. ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిసిఎ) బృందం జరిపిన ఈ దాడిలో సుమారు రు. 14 లక్షల విలువైన కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
నవ్‌సారిలోని ఒంచి గ్రామంలోని శివ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫెసిలిటీలో అవకతవకలు జరిగాయని పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు అధికారులు. రైడ్ ఆవరణలో 10 పామాయిల్ కంటైనర్లను గుర్తించారు. జరాత్ ఎఫ్‌డిసిఎ కమిషనర్ హెచ్‌జి కోషియా పౌరులకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన ఆహార ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిబద్ధత కలగి ఉందని తెలిపారు. ల్యాబ్ ఫలితాలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన.
