
గ్రేటర్లో 20 చోట్ల దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. పీపుల్స్ ప్లాజా వద్ద మేళతాళాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపును భక్తులు వైభవంగా నిర్వహించారు. శనివారం వరకు మొత్తం 30,330 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క పీపుల్స్ ప్లాజాలోనే 29,813 విగ్రహాల నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనాలు సాఫీగా జరిగినట్లు వివరించారు. వెలుగు, హైదరాబాద్ సిటీ