
కోల్కతా: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద కేసులు దాఖలు చేయడానికి ముందే దాదాపు 30 వేల కేసులు పరిష్కారం అయ్యాయని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ప్రకటించింది. పరిష్కారమైన మొత్తం డిఫాల్టుల విలువ దాదాపు రూ.13.78 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. ఐబీసీ అమలులోకి వచ్చిన తర్వాత, రుణదాతలు, రుణగ్రహీతలు కోర్టు వెలుపల చర్చించి పరిష్కారానికి రావడం పెరిగింది.
దీనివల్ల కోర్టులపై భారం తగ్గడమే కాకుండా, సమయం ఖర్చు కూడా ఆదా అవుతోందని సంస్థ తెలిపింది. ఐబీబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేశ్జాన్ కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, చాలా సందర్భాల్లో, ఐబీసీ కింద చర్యలు తీసుకుంటామని రుణదాతలు హెచ్చరించిన తర్వాత రుణగ్రహీతలు తమ బకాయిలను చెల్లించడానికి ముందుకు వస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల చాలా కేసులు అధికారికంగా దివాలా ప్రక్రియలోకి వెళ్లకుండానే పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ‘‘ఆర్బీఐ ప్రకారం షెడ్యూల్డ్కమర్షియల్బ్యాంకులు వివిధ మార్గాల ద్వారా రూ.96 వేల కోట్ల బకాయిలను రాబట్టుకున్నాయి.
వీటిలో ఐబీసీ విధానంలో రూ.46 వేల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది మార్చి నాటికి 1,194 కార్పొరేట్ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ప్రాసెస్లు (సీఐఆర్పీలు) పరిష్కారమయ్యాయి. దీంతో రుణగ్రహీతలకు రూ.3.98 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తం క్లెయిముల్లో ఇవి 32 శాతానికి సమానం. రుణదాతలు రిజల్యూషన్ప్లాన్ల ద్వారా లిక్విడేషన్విలువలో 170 శాతం రికవరీ చేసుకున్నారు. మొత్తం సీఐఆర్పీల్లో 40 శాతం కంపెనీలు దివాలా తీసినవి ఉన్నాయి”అని ఆయన వివరించారు.