రోప్ వే ప్రమాదంలో ముగ్గురి మృతి

రోప్ వే ప్రమాదంలో ముగ్గురి మృతి

దేవ్గఢ్: ఝార్ఖండ్ లోని దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 40 మందిని భారత వాయుసేన రక్షించింది. మంగళవారం మధ్యాహ్నానికి మరో ఇద్దరు పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ నలభై గంటలుగా కొనసాగుతోంది. రెండు హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ సైనికులు చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోపాటు ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో కలసి పని చేస్తున్నాయని దేవ్ గఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ అన్నారు.

కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇదిలాఉంటే.. ప్రమాదం తర్వాత సోమవారం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళాలు కాపాడే క్రమంలో ఓవ్యక్తి కిందపడి మరణించాడు. కాగా, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని కాపాడేందుకు రక్షణ బలగాలు ప్రయత్నించాయి. అయితే గాల్లో ఉన్న హెలికాప్టర్ వద్దకు తాడు సాయంతో చేరుకోగలిగిన ఆ వ్యక్తి.. కాక్ పిట్ వద్దే వేలాడుతూ కనిపించాడు. అయితే అతడ్ని హెలికాప్టర్ లోపలకు లాక్కునేందుకు సైన్యం చేసిన యత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని వెస్ట్ బెంగాల్ కు చెందిన వాడిగా గుర్తించారని సమాచారం. 

మరిన్ని వార్తల కోసం:

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలె

ఎక్కువ కాల్షియాన్ని అందించే ఫుడ్స్​ ఇవే..