44 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్ట్.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే.?

44 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్ట్.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే.?

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో డిమాండ్ కు తగ్గట్లుగా సరాఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. ఐతే వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక వ్యాక్సిన్ డోసులు భారీగా వేస్ట్ అయ్యాయని RTI ఇచ్చిన సమాధానంలో తెలిసింది. ఏప్రిల్ 11 నాటికి దేశవ్యాప్తంగా 10 కోట్ల డోసులు పంపిణీ చేయగా...44 లక్షల డోసులు వేస్ట్ అయినట్లు తెలిపింది.  12.10 శాతంతో తమిళనాడు వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. 

తర్వాతి స్థానాల్లో వరుసగా...9.74 శాతంతో హర్యాణా, 8.12 శాతంతో పంజాబ్, 7.8 శాతంతో మణిపూర్, 7.55 శాతంతో తెలంగాణ ఉన్నాయి. జీరో పర్సెంట్ వెస్టేజ్ ఉన్న రాష్ట్రాల లిస్టులో వెస్ట్ బెంగాల్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం,గోవా, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఉన్నాయి. వ్యాక్సిన్ కొరత ఢిల్లీ,మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మధ్య వివాదానికి దారి తీసింది.