
జపాన్ దేశం భారీ వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతోంది. సౌత్ వెస్ట్రన్ జపాన్ లోని క్యుషు రాష్ట్రం… సాగా, ఫుకువోకా, నాగసాకి ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగి పోవడంతో… ఈ ఏరియాల్లోనూ జనం ఇళ్లు, ఊళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 6 లక్షల 70వేల మంది వెంటనే ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు అధికారులు.
సాగాలో.. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు నీటమునిగాయి. దీంతో.. రైళ్లు నడవడంలేదు. మరెన్నో వాహనాలు వరదలో మునిగిపోయాయి. చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక్కడే ముగ్గురు చనిపోయారని.. మరో వ్యక్తి గాయపడ్డాడని చెప్పారు అధికారులు.
వెస్ట్రన్ నుంచి నార్తర్న్ జపాన్ వరకు రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు పడతాయని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది.