గ్రీన్ స్టార్ వెంచర్ ముందు ఆందోళన 

గ్రీన్ స్టార్ వెంచర్ ముందు ఆందోళన 

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట పరిధిలోని గ్రీన్ స్టార్ వెంచర్​లో ప్లాట్లు కొన్న యజమానులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ 2003లో గ్రీన్ స్టార్ పేరిట అంబికాప్రసాద్ అనే వ్యక్తి తూప్రాన్ పేట్ లో వెంచర్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో దాదాపు 100 మందికి పైగా ప్లాట్లు కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్లు కూడా చేశారని చెప్పారు. ఆ వెంచర్​లో ప్లాట్లు కొన్న యజమానుల సైతం హద్దులు నాటుకొని వెళ్లామన్నారు.

కొన్ని సంవత్సరాల తర్వాత తమకు తెలియకుండా అంబికాప్రసాద్ హద్దురాలను తొలగించి ప్లాట్ల యజమానులను  రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ప్లాట్ల యజమానులు అందరూ ఆ స్థలంలో హద్దురాలు నాటుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. తమ వద్ద కోర్టు ఇచ్చిన ఆర్డర్​కాపీ ఉందని, తమను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను వేడుకోవడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వారు ప్లాట్ల హద్దురాలు
 నాటుకున్నారు.