విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌ ను పొడిగించిన యాజమాన్యం

విశాఖ స్టీల్ ప్లాంట్  బిడ్డింగ్‌ ను పొడిగించిన యాజమాన్యం

స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ను మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ లో నిర్ణయించిన తేదీ ప్రకారం ఏప్రిల్ 15 మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ గడువు ముగియ్యాలి. కానీ తాజాగా ఐదు రోజులు పొడిగించడంతో ఇది ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వేలంలో ఇప్పటివరకు 21 సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లుగా సమాచారం.

ఈ వేలంలో ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థలను ఆర్ఐఎన్ఎల్(RINL) ఆహ్వానించగా.. ఈ బిడ్డింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సైతం ఆసక్తి కనబర్చింది. మరో ముఖ్య విషయమేమిటంటే జేడీ లక్ష్మీ నారాయణ ఈ బిడ్డింగ్ లో పాల్గొన్నారు. విశాఖ ప్లాంట్ ను కేంద్రం క్లీన్ షేవ్ చేయాలని చూస్తే.. తాను క్లియర్ సేవ్ చేయడానికి బిడ్డింగ్ వేస్తున్నానని తెలిపారు. అంతకుముందు ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన జేడీ.. EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి. క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని జేడీ లక్ష్మినారాయణ ప్రకటించారు.  తెలుగు ప్రజలు ఒక్కొక్కరు రూ.200 చొప్పున ఇస్తే చాలని ఆయన చెప్పారు. అందులో భాగంగా తొలి మొత్తంగా రూ. 200 విరాళాల సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి...ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని జేడీ తెలిపారు.  

ఈ బిడ్డింగ్ కు మార్చి 27న నోటీఫికేషన్ వెలువడగా.. బిడ్ వేసే వారికి కొన్ని నిబంధనలు పెట్టారు. 

  • కోకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోక్, ఇనుప ఖనిజం సరఫరా చేసే సంస్థలకే బిడ్ చేసే అవకాశం ఈవోఐ (EOI) నిబంధనల ప్రకారం కారణం లేకుండానే బిడ్ ను తిరస్కరించే హక్కు ఉంది.
  • స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన నిర్వహణ మూలధనం సమకూర్చాలి.
  • స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనే సంస్థలకు అవకాశం