ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా శ్రావణి

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా శ్రావణి

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా పి. శ్రావణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీడీఎంఏ ఆదేశాల మేరకు తొలి పోస్టింగ్ ఆర్మూర్ మున్సిపల్​ కమిషనర్​ గా  వచ్చారు. ఇదివరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్​ గా ఉన్న రాజు 18 రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.  దీంతో రవిబాబుకు 13 రోజుల క్రితం ఆర్మూర్ ఇన్​చార్జి కమిషనర్​గా బాధ్యతలు ఇచ్చారు.  మున్సిపల్​ కమిషనర్ శ్రావణికి ఆఫీస్​ సిబ్బంది అభినందనలు తెలిపారు.